![]() |
![]() |
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీముఖి కపుల్స్కి కొన్ని ఇంటరెస్టింగ్ టాస్కులు ఇచ్చింది. అందులో ముందుగా నటరాజ్ మాష్టర్ - నీతూకి వాళ్ళ అమ్మాయి షోకి వచ్చింది అనే కాన్సెప్ట్ ఇచ్చి కొంచెం ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చెప్పింది. ఇక నటరాజ్ ఐతే తన పాప షోకి వచ్చిందని ఒక పిచ్చి పట్టిన ఫాదర్ లా ప్రవర్తించడం చేసేసరికి జడ్జి రాధ ఆ యాక్ట్ కి కన్నీళ్లు పెట్టేసుకుంది. నటరాజ్ మాష్టర్ కూతురు లక్ష్య ఎక్కడికి వెళ్లినా పక్కనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ షోకి దూరంగా ఉంది అంటూ శ్రీముఖి చెప్పింది.
తర్వాత రాధా మాట్లాడింది. "మాష్టర్ జి చిన్న పాపే కాదు పిల్లల్ని పెద్ద చేసి మ్యారేజ్ చేసి పంపించినా కూడా ఆ ఫీలింగ్ పోదు. నా జీవితంలో కార్తీక నా లక్. ఆమెకు పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం మా ఆయన ఏడవడం చూసాను. పెళ్లి అయ్యి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడుస్తారు కానీ పెళ్లి తర్వాత రోజు మరవీడు అంటారు పెళ్లికూతురు తండ్రి స్వీట్స్ అవన్నీ ఇచ్చాక మండిలో కూర్చుంది కార్తీక వచ్చి. వాళ్ళ నాన్నను గట్టిగా పట్టుకుంది. అప్పుడు నేను చూసాను ఒక మగాడు అంతలా ఏడవడం. ఆ ప్రేమ ఉంది చూడండి అది చాలు మనకు" అని చెప్పింది. ఇక అనిల్ రావిపూడి ఐతే "ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక శక్తీ పీఠం ఉన్నట్టే. భూగ్రహంలో ఎక్కడ ఉన్నా ఆమ్మ నాన్న గురించి ఆలోచించేది ఒక్క ఆడపిల్లే." అని చెప్పాడు.
![]() |
![]() |